Tuesday, September 17, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన వ్యక్తిని హెచ్‌న్యూ, ఫిలింనగర్ పోలీసులు అరెకస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 16గ్రాముల కొకైన్, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రష్మీ పెరుమాల్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన ఒకారో కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో న్యూఢిల్లీకి వచ్చాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దుస్తుల ఎగుమతి వ్యాపారం పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాడు. తమిళనాడులోని తిరువూరును దస్తుల వ్యాపారం పేరుతో సందర్శించాడు. తర్వాత నైజీరియా దేశానికి చెందిన అబ్రహం జాకోబ్ ఉకోహతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తుండగా గోల్కొండ పోలీసులు 2016లో అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నైజీరియాకు చెందిన ఒబాసితో కలిసి కొకైన్ విక్రయించడం ప్రారంభించాడు. దీంతో 2018లో గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒబాసి వద్ద కొనుగోలు చేసిన కొకైన్‌ను నగరంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు టెలీగ్రాం యాప్‌లో గ్రూపు ఏర్పాటు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, డానియల్, ఎస్సై వెంకటరాములు తదితరులు పట్టుకున్నారు.

ఎల్‌ఎస్‌డి బోల్ట్…
ఎల్‌ఎస్‌డి బోల్ట్ విక్రయిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్, హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 43ఎల్‌ఎస్‌డి బోల్ట్ కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.11,50,000 ఉంటుంది. నల్గొండ జిల్లాకు చెందిన వి.లక్ష్మిపతి అలియాస్ లక్కీ ఇంజనీరింగ్ డిస్‌కంటిన్యూ చేశాడు. గంజాయికి బానిసగా మారాడు. అరకు నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. తర్వాత గోవాలో జరిగే డ్రగ్స్ పార్టీలో పాల్గొనేవాడు. ఈ పార్టీల్లో డ్రగ్స్ విక్రయిల గురించి తెలుసుకున్నాడు. గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ముంబాయి నుంచి కొరియర్‌లో ఎల్‌ఎస్‌డి బోల్ట్‌ను నిందితుడు తెప్పించాడు. ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, డానియల్, ఎస్సై వెంకటరాములు తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News