Tuesday, December 24, 2024

ఇస్రో రిక్రూట్‌మెంట్ పరీక్షలో మోసానికి ఇద్దరు హర్యానా అభ్యర్థులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి)కు సాంకేతిక సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు నిర్వహించిన పరీక్షలో తప్పుడు విధానాలు అవలంబించిన ఇద్దరు హర్యానా అభ్యర్థులను పోలీస్‌లు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు పరీక్ష కేంద్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి బాగా పొద్దు పోయాక అధికారికంగా ఈ అరెస్టు జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి హర్యానాకు చెందిన మరో నలుగురిని అదుపులో తీసుకున్నారు. వీరు పరీక్ష రాశారా లేదా అన్నది ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోప్రమేయం ఉన్నే కోచింగ్ సెంటర్ల వారిని , ఇతరులపై కేసు నమోదైంది. అరెస్టయిన అభ్యర్థులు మొబైల్ ఫోన్ కెమెరాలు ఉపయోగించి ప్రశ్నలు బయటకు ఎవరో ఒకరికి పంపించి జవాబులు రప్పించుకున్నట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News