Wednesday, January 22, 2025

అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి  : మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఇద్దరు నేరస్తులకు జీవిత ఖైధి శిక్ష వెయ్యి రూపాయల జరిమానా విదించిన ట్లు జిల్లా ఎస్పీ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. జూన్ 2, 2019 లో శివాజి పవర్ 40, ఆస్తుల అశోక్ 32 ఇద్దరు కలసి రాత్రి రెండు గంటల సమయంలో వారి ఇంటి దగ్గర లోని ఇంటి నుండి ధనలక్ష్మీ 35 అనే మహిళను బలవంతంగా కామారెడ్డి లోని సిరిసిల్ల రోడ్డులో వారు పని చేసే షెడ్డులోకి తీసుకువచ్చి కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు.అమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

పూర్తి సాక్షాధారాలు సేకరించి నేరస్తులపై అభియోగ పత్రము కోర్టులో సమర్పించగా ఎస్సి,ఎస్టీ స్పెషల్ కోర్టు నిజామాబాద్ న్యాయమూర్తి టి.శ్రీనివాస్ సాక్షులను విచారించారు. సాక్షాధారాలను పరిశీలించి నేరం నిరూపణ అయినందున నేరస్తులకు జీవిత ఖైదీ శిక్షా మరియు 1000 రూపాయల జరిమానా విధించారు. కేసు పరిశోధన చేసిన కామారెడ్డి పట్టణ ఇన్సెక్టర్ జి.రామకృష్ణ, డిఎస్పీ లక్ష్మీనారాయణ, సాక్షులను త్వరితగతిన కోర్టు నుందు హాజరుపరిచి పర్యవేక్షించిన ప్రస్థుత కామారెడ్డి పట్టణ పోలీస్టేషన్ ఇన్సెక్టర్ పి.సురేష్, పోలీసుల తరపున వాదనలు వినిపించిన పిపి కవితా రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ సంతోష్, కోర్టు లైజినింగ ఆఫీసర్ విఠల్, హన్మాండ్లు, హెడ్ కానిస్టేబుల్ లను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News