Tuesday, December 3, 2024

కశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు.. ఇద్దరు యుపి కూలీల మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బద్గామ్ జిల్లాలో స్థానికేతర వలస కూలీలపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందారని అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. మృతి చెందిన వలసకూలీలు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడైంది. వీరిని సోఫియాన్, ఉస్మాన్‌గా గుర్తించారు. అయితే వారి పేర్లు , ఘటన వివరాలు పూర్తిగా తెలియలేదు. ఘటన గురించి తెలియగానే భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడికి చేరాయి. ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టాయి. గడిచిన 12 రోజులలో వలసకూలీలపై ఉగ్రవాదులు దాడులకు దిగడం ఇది రెండోసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News