Monday, December 23, 2024

అవంతిపోరాలో జైషే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

 

Awantipora encounter

శ్రీనగర్:  దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. హతమైన మిలిటెంట్లలో ఒకరు జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన కైజర్ కోకాగా జమ్మూకాశ్మీర్ పోలీసులు గుర్తించారు, అతను గత నాలుగు సంవత్సరాలుగా దక్షిణ కాశ్మీర్‌లో చురుకుగా పనిచేస్తున్నాడని  చెప్పారు. అవంతిపోరాలోని వందఖ్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో  జమ్మూకాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ , పారామిలటరీ బలగాల సంయుక్త బృందం ఉదయం ఆ గ్రామాన్ని చుట్టుముట్టిందని అధికారులు తెలిపారు. సంయుక్త బృందం గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News