Thursday, January 23, 2025

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two militants killed in Srinagar

 

శ్రీనగర్: శ్రీనగర్‌లో శనివారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు మరణించారు. లష్కరే తాయిబాకు చెందిన రిసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఇద్దరిని శ్రీనగర్ పోలీసులు మట్టుపెట్టారని ఐజి విజయ్ కుమార్ తెలిపారు. శ్రీనగర్‌లోని జకుర ప్రాంతంలో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. మరణించిన ఉగ్రవాదులలో ఒకరికి జనవరి 29న అనంతనాగ్‌లో ఇఖ్లాక్ హజమ్ అనే పోలీసు హత్యతో సంబంధం ఉందని ఆయన చెప్పారు. మరణించిన ఉగ్రవాదుల నుండి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నటు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News