Saturday, March 29, 2025

గాల్లో ఢీకొన్న విమానాలు.. అపస్మారక స్థితిలోకి ముగ్గురు

- Advertisement -
- Advertisement -

ఈశాన్య ఫ్రాన్స్‌లోని సెయింట్-డిజియర్‌కు పశ్చిమాన ఉన్న ఎయిర్‌బేస్‌లో యుద్ధ విమానాల విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనగా.. రెండు విమానాలు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఢీకొన్న విమానాలు అల్ఫా జెట్ రకానికి చెందినవి. ఇవి సమీపంలోని ఫ్యాకరీ మీద పడటంతో అక్కడ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News