Friday, November 22, 2024

బాలురపై దూసుకెళ్లిన డిసిఎం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వస్తువులు అమ్ముకుని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు బాలురపై డిసిఎం దూసుకుని వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర్‌ప్రదేశ్, అమేథీ జిల్లాకు చెందిన నానక్ జోగి కుటుంబంతోపాటు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి రింగులు, వస్తువులు విక్రయించి బతుకుతున్నారు. ఇతడికి ఇద్దరు కుమారులు అస్లాం జోగి(13), సవాన్ జోగి(15) ఉన్నారు. రోజు మాదిరిగానే తన ఇద్దరు కుమారులు, తన చుట్టమైన మరో బాలుడు మిర్చి జోగితో కలిసి శనివారం రాత్రి వరకు వస్తువులు విక్రయించారు. తర్వాత నల్లగండ్ల సమీపంలోని అండర్‌బ్రిడ్జి ఓల్డ్ ఎంఐజి వద్ద రాత్రి సమయంలో నిద్రించారు.

ముగ్గురు బాలురు వరుసగా పడుకోగా, నానక్ జోగి వారికి కొంత దూరంలో నిద్రించాడు. తెల్లవారుజామున డిసిఎం టిఎస్07యూబి4380 వేగంగా దూసుకుని వచ్చి నిద్రిస్తున్న అస్లాం జోగి, సవాన్ జోగి కాళ్లు పొట్టపై నుంచి వెళ్లింది, తన వద్దకు రాగానే మిర్చి జోగి ఒక్కసారిగి కేకలు వేశాడు. దీంతో డిసిఎం డ్రైవర్ వ్యానును వెనకకి పోనిచ్చాడు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన అస్లాం జోగి, సవాన్ జోగి అక్కడికక్కడే మృతిచెందగా, మిర్చీ జోగికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News