Monday, November 18, 2024

ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భవానీపట్నం : ఒడిశా కలహండి జిల్లాలో ఇద్దరు గిరిజన కౌమార బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు . ఈ సంఘటన ఏప్రిల్ 16 న జరిగినప్పటికీ, నిందితులు వేరే సామాజిక వర్గానికి చెందిన వారైనందున పోలీస్‌లకు ఈ విషయం ఎలాగైనా తెలియజేయాలని గిరిజన పెద్దలు నిర్ణయించారు. దీంతో బుధవారం సాయంత్రం నిందితులపై బీజెపూర్ పోలీస్ స్టేషన్‌ల ఫిర్యాదు అందిందని పోలీస్‌లు గురువారం తెలియజేశారు.

ప్రాథమికంగా 14 నుంచి 17 ఏళ్ల ముగ్గురు కౌమార బాలికలు జాతర చూసి ఇంటికి తిరిగి వస్తుండగా నిందితులు ఐదుగురు వారిని అడ్డుకున్నారని, వారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. అయితే ముగ్గురు బాలికల్లో ఒకామె తప్పించుకుని సమీపాన పొదల్లో దాక్కుందని తెలిసింది. మిగతా ఇద్దరి బాలికలపై నిందితులు అదేపనిగా అత్యాచారం చేశారని ఫిర్యాదు అందినట్టు పోలీసులు చెప్పారు.

నిందితుల కోసం గాలిస్తున్నట్టు బీజెపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి లింగరాజ్ సేథీ చెప్పారు. బాధితులైన ముగ్గురి బాలికలకు భవానీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకుంటే ఆందోళన సాగిస్తామని కలహండి ఆదివాసీ సంఘ అధ్యక్షుడు ప్రకాష్ మఝీ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News