- Advertisement -
సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, పైడిగుమ్మల్‌లోని ఓ వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఒడిశాకు చెందిన బైద్యనాథ్ బత్ర, హరిసింగ్ మహాజీగా పోలీసులు గుర్తించారు. కోహిర్ ఎస్‌ఐ గోపతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం …పైడిగుమ్మల్ సమీపంలోని కూలి పనిచేసేందుకు వీరిద్దరూ వలస వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి వీరు అదృశ్యం కాగా ఈ ఘటనపై 13 వ తేదీన పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. కాగా, స్థానికులు గురువారం రాత్రి వ్యవసాయ బావిలో రెండు మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని వాటిని వెలికితీశామని తెలిపారు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటం వలన గ్రామపెద్దల సహాయంతో స్థానికంగానే అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
- Advertisement -