Monday, December 23, 2024

శిథిలాల కిందే 128 గంటలు.. ప్రాణాలతో రెండు నెలల చిన్నారి

- Advertisement -
- Advertisement -

హతాయ్: భారీ భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీ, సిరియా భూభాగాల్లో ఓ వైపు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నప్పటికీ శిథిలాల కింది నుంచి మృతదేహాలు గుట్టలుగుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. శిథిలాలను పూర్తిగా తొలగించే దాకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 28 వేలు దాటగా ఈ సంఖ్య 50 వేలకు చేరుకుంటుందని అంచనా. ఇదిలా ఉంటే శిథిలాల కింద మృతదేహాలతో పాటే కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు.

భూకంపం సంభవించి ఆరు రోజులైనా తిండి, నీరు లేకపోయినా కొంతమంది ప్రాణాలతో ఉండడం ఆశ్చర్య కలిగిస్తోంది. తాజాగా రెండు నెలల పసికందు శిథిలాల కింద ప్రాణాలతో దొరికింది. దాదాపు 128 గంటలు ఆ చిన్నారి శిథిలాల కిందే ఉండిపోయింది. టర్కీలోని హతాయ్ పట్టణంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. శనివారం శిథిలాలకిందనుంచి బయటపడిన వారిలో రెండు నెలల పసికందుతో పాటుగా భూకంపం సంభవించిన వేర్వేరు ప్రాంతాలనుంచి ఓ రెండేళ్ల బాలిక, ఆరు నెలల గర్భిణి,70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News