Friday, November 22, 2024

రెండు నెలల పసిపాప కిడ్నాప్ కేసు ను ఛేదించిన పోలీసుుల

- Advertisement -
- Advertisement -

గోషామహల్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌కు గురైన రెండు నెలల పసిపాప కథ సుఖాంతం అయ్యింది. సీసీ పుటేజీల ఆధారంగా ఉప్పుగూడ రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతానికి తరలించేందుకు యత్నిస్తున్న సమయంలో పోలీసులు కిడ్నాప్‌కు పాల్పడిన ఓ మహిళతోపాటు యువకుడిని అరెస్ట్‌చేసి, పసిపాపను స్వాధీనం చేసుకుని, నిందితులను రి మాండ్‌కు తరలించారు. సంబంధిత వివరాలు పోలీసుల కథనం ప్ర కారం… స్వాతి అనే మహిళ రెండు నెలల చిన్నారి అమ్ములుతో కలిసి గత కొద్ది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రి ఓపీ గేటు ఎదురుగా గల ఫుట్‌పాత్‌పై ఉంటుంది.

Also Read: రుణ దాతలకు షరతులు

ఆమెతో పాటు ఫుట్‌పాత్‌పై ఉంటూ బిక్షాటన చేసే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా వీర్‌నగర్‌కు చెందిన జ్యోతి (30), జార్ఖండ్ రాష్ట్రంలోని పలంబూబ్ జిల్లా బందర్‌పూర్ ప్రాంతానికి చెందిన వికాస్‌కుమార్ (19)లు కలిసి ఈ నెల 27న తెల్లవారుజామున స్వాతి కుమార్తె రెండు నెలల పసి పా ప (అమ్ములు)ను అపహరించి అఫ్జల్‌గంజ్‌లో బస్సెక్కి, ఉప్పుగూడ స్టేషన్‌లో దిగారు. స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్జల్‌గంజ్‌లో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా శుక్రవారం మధ్యాహ్న సమయంలో పసిపాపను కిడ్నాప్ చేసిన నిందితులు ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి పసిపాపను స్వాధీనం చేసుకున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులు ఇద్దరిపై నగరంలో ఎక్కడా పోలీసు కేసులు లేవని పోలీసులు తెలిపారు. పసిపాప తల్లి స్వాతి అందుబాటులో లేక పోవడంతో రెండు నెలల పసిపాపను సంరక్షణ నిమిత్తం చైల్డ్‌లైన్‌కు పంపించినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌కు గురై అదృష్టవశాత్తు పోలీసులకు చిక్కి, తల్లి సంరక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని రెండు నెలల పసిపాప (అమ్ములు) చైల్డ్‌లైన్ సంరక్షణ పొందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News