Tuesday, December 3, 2024

బిగ్‌బాస్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః బిగ్‌బాస్ ఫైనల్ తర్వాత జరిగిన విధ్వంసం కేసులో మరో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ విధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు 20మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడ చెక్‌ఫోస్టుకు వద్ద ఉన్న హోటల్‌లో పనిచేస్తున్న ఎం. సుధాకర్ అనే యుకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితోపాటు ఇందిరానగర్‌కు చెందిన పవన్ అనే ఆఫీస్ బాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News