Monday, December 23, 2024

సోనాలి ఫొగట్ మృతి కేసులో మరో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two more arrested in Sonali Phogat's death case

పనాజి: టిక్‌టాక్ నటి, బిజెపి నాయకురాలు సోనాలి ఫొగట్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా పేర్కొన్న పోలీసులు ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు పేర్కొడంతో హత్య కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలను కలిపారని, ఆదే ఆమె మరణానికి దారి తీసిందని పోలీసుఉల శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్య కేసుకు తోడు డ్రగ్స్ కేసును కూడా నమోదు చేసిన పోలీసులు క్లబ్ యజమాని ఎడ్విన్ న్యూన్స్, డ్రగ్స్ డీలర్ దత్తాప్రసాద్ గావోంకర్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి గురువారం అరెస్టు చేసిన సోనాలీ సహాయకులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌లను కోర్టు శనివారం పది రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News