Wednesday, January 22, 2025

కుమారుని కోసం రెండు లక్షలు పెట్టి ఏఈ పరీక్ష పేపర్ కొన్న తండ్రి..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కేసు వ్యవహారం అంతా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అనేకమంది అరెస్టు కాగా తాజాగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ రాజశేఖర్ రేణుక భర్త రాడ్యా నాయక్ నుంచి నుంచి మహబూబ్ నగర్ చెందిన మైసయ్య అనే వ్యక్తి తన కుమారుడు జనార్ధన్ కోసం రెండు లక్షలు ఇచ్చి ఏఈ పేపర్ను తీసుకున్నట్లు సిట్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తండ్రి కొడుకులైన మైసయ్య జనార్ధన్ లను సిట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఇప్పటిదాకా ఈ కేసులో సిట్ పోలీసులు 19 మంది నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News