Monday, December 23, 2024

కునో నేషనల్ పార్కులో మరో రెండు చిరుత పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్ : కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీతాలో వరుసగా చీతాలు మరణిస్తుండడం పెద్ద ఎదురు దెబ్బ.మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందగా, గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో మూడు మృతి చెందాయని చెప్పారు. ఈనెల 23 మంగళవారం ఒక చిరుత పిల్ల మృతి చెందగా, మరో రెండు అదే రోజు మధ్యాహ్నం మృతి చెందాయి. కానీ ఈ మరణాల సంఖ్యను గురువారం వెల్లడించారు. ఎందుకు అదే రోజు వెల్లడించలేదో అధికారులు కారణం చెప్పడం లేదు. ఈ మరణాలతో అధికారులు ఆడ చిరుత జ్వాలా, మిగతా మూడు పిల్లల కదలికలపై దృష్టి కేంద్రీకరించారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి కునో పార్కుకు తీసుకు వచ్చిన జ్వాలా గత మార్చి నెలాఖరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఈనెల 23 న మూడు పిల్లల పరిస్థితి బాగా లేదని గుర్తించారు. వెంటనే చికిత్స చేయించి రక్షించాలని ప్రయత్నించారు. ఆనాడు పగటి ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉన్నాయి. చికిత్స అందించినా అవి బతకలేదని అధికారులు చెప్పారు. నాలుగో చిరుత పిల్ల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయినా పూర్తి వైద్య చికిత్సలోనే ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News