Thursday, December 26, 2024

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న మరో రెండురోజులపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ద్రోణి పశ్చిమ విదర్భ వరకూ ఉత్తర అంతర్గత కర్ణాటక , మరఠ్వాడ మీదుగా సముద్ర మట్టానికి 0.9కి.మి ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24గంటల్లో ఆదిలాబాద్ ,మంచిర్యాల , పెద్దపల్లి, జయశకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ , జనగాం , యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అకడక్కడ ఉరుములు మెరుపులు, గంటకు 40కి.మి వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడివ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ కేంద్రం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

రానున్న 48గంటలు ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. సోమవారం నుంచి మంగళ వారం వరకూ అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది . గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156మి.మి వర్షపాతం నమోదైంది. కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ , సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి , మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News