మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాంతాల్లో రాగల రెండు రో జుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. వర్షాల నేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి అధికారులు సూచించారు. కింది స్థాయిలో గాలులు తూర్పు, దిశలనుంచి తెలంగాణ రా ష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో చ లిగాలుల తీవ్రత కూడా పెరుగుతూ వస్తోంది. రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉం టుందని,గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తే లికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేం ద్రం వెల్లడించింది. వేళలో పొగమం చు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉం ది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 27డిగ్రీలు, 21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తరువాత 48గంటల్లో కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
శనిగరంలో 70.5 మి.మీ వర్షం
గడిచిన రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా శనిగరంలో 70.5 మి.మీ వర్షం కురిసిం ది. మిగిలిన ప్రాంతాల మేడారంలో 61.3, తెల్దేవరపల్లిలో 43.5, దామెరలో 37.8, చందంపేటలో 29,వెంకేశ్వర్‌లో 28.5,నల్లబెల్లెలో 27. 5, గోవిందరావుపేటలో 27, పులకుర్తిలో 23, కోహెడలో 23.8, మేడపల్లిలో 23, తాడ్వాయ్ లో 23, కాగజ్‌నగర్‌లో 23, కమలాపూర్‌లో 22.5, సిద్దిపేట్‌లో 20.3, నడికుడలో 19.8, బె జ్జింకిలో 19, ఏటూరునాగారంలో 17.3, భూ పాలపల్లిలో 15.8, రేగోండలో 15.3 మి.మీ చొ ప్పున వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.
మరో రెండ్రోజులు వర్షాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -