Monday, January 20, 2025

నగరంలో మరో రెండు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో శుక్రవారం సైతం వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురువగా , మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడడంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 19. నుంచి 20 మధ్య నమోదు అయ్యాయి. దీంతో ఎండకాలం సైతం చలికాలన్ని తలపించింది. మరో రెండు రోజుల పాటు నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులుంటే తప్ప బయటికి రాకపోవడమే మంచిందని సూచించారు. ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోవడంతో పాటు అక్కడక్కడ ఉదయం వేళ్లలో ఉరుములు , మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండగా, సాయంత్రంరాత్రి వేళ్లలో మాత్రం వడగాళ్ల తో కూడిన వర్షం కురిసే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.

అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి 

నగరంలో రెండు రోజుల పాటు వడగాళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. గ్రేటర్ పరిధిలోని 6 జోన్లలోని మాన్సూన్ అత్యవసర బృందాలను జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు. అకాల వర్సాల నేపథ్యంలో ఈ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఏలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే పరిష్కారించేందుకు అన్ని చర్యలు తీసుకుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అకాల వర్షాల కారణంగా ఏలాంటి సమస్యలు కల్గిన వెంటనే జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూం నంబర్‌కు 040 21111111 ను సంప్రదించాల్సిందిగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి నగరవాసులకు సూచించారు. వర్షాలకు ఈదురగాలులు కూడా తోడు కానుండడంతో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News