Sunday, December 22, 2024

పంతుగులు ఎగురవేస్తూ మరో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : సంక్రాంతి పండగ వేళా పంతుంగుల సంబురాలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పంతుగులు ఎగుర వేస్తున్న ఉత్సహాంలోనగర వ్యాప్తంగా ప్రమాదాల భారిన పడి కొందరు. రోడ్లపై పడి తెగి పడి ఉన్న మంజాల కారణంగా మరి కొందరూ ఇప్పటీకే 7 మంది యువకులు, చిన్నారులు చనిపోగా మంగళవారం తాజా మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. నేరెడ్‌మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్‌లో గాలిపటం ఎగురవేస్తూ భువన్ సాయి అనే బాలుడు 4వ అంతస్తు పైనుంచి ప్రమద వశాత్తు కింద పడ్డాడు.

దీంతో బాలుడికి త్రీవ గాయాలు కావడంతో హూటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అదేవిధంగా మధురానగర్‌లోనూ మరో విషాదం చోటు చేసుకుంది. పతంగులు ఎగురవేస్తూ చౌహన్ దేవ్ అనే యువకుడు మృత్యువాత పడ్డారు. మధురానగర్ రహ్మత్‌నగర్‌లోని పంతంగు ఎగురవేస్తూ ఐదంతస్తుల భవనం పైనుంచి పడిపోవడంతో చౌహన్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే చౌహాన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చౌహాన్ స్నేహితులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News