Saturday, November 23, 2024

హిమాయత్‌సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Two more gates of Himayatsagar lifted

ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా వరద జలాలు దిగువకు
2100 క్యూసెక్కుల నీరు మూసీనదిలోకి విడుదల
పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమ్తతంగా ఉండాలి
పరిస్దితులను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు వాటర్‌బోర్డు వెల్లడి

హైదరాబాద్: నగరం చుట్టపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరద నీటితో కొత్త కళ సంతరించుకున్నారు. రోజు రోజుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పొటెత్తడంతో రెండు రోజులుగా హిమాయత్‌సాగర్ రెండు గేట్లు ఎత్తివేసి మూసీనదిలోకి వదులుతున్నారు. మంగళవారం రిజర్వాయర్ నీటి మట్టం 1763.20 అడుగుల వద్ద రెండు గేట్లను ఎత్తి దిగువనున్న మూసీలోకి వదిలారు. దీంతో ప్రస్తుతం మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2100 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. గత జూలై 20న జలాశయానికి నీరు బారీగా చేరడంతో గేట్లు ఎత్తి మూసీలోకి వదిలారు. పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఇప్పటికే కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించామని, జలమండలి, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులు పరిస్దితులను పర్యవేక్షిస్తున్నారు.

హిమాయత్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి స్దాయి 1762.95 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తి సామర్దం 2.968 టిఎంసీలు, ప్రస్తుత సామర్దం 2.780 టిఎంసీలు, ఇన్‌ప్లో 800 క్యూసెక్కులు, అవుట్‌ప్లో 2100 క్యూసెక్కులు, మొత్తం గేట్లు 17 ఉండగా, ప్రస్తుతం 4 గేట్ల ద్వారా వరద జలాలను మూసీలోకి వదలుతున్నట్లు వాటర్‌బోర్డ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News