Wednesday, January 22, 2025

సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జిలు

- Advertisement -
- Advertisement -

Two more judges to the Supreme Court

మొత్తం సంఖ్య పూర్తి స్థాయిలో ఇప్పుడు 34

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం ప్రకటన శనివారం వెలువడింది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు తిరిగి మునుపటిలాగా 34 మంది జడ్జిల పూర్తి స్థాయికి చేరుకుంటోంది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు జడ్జి జంషేడ్ బి పర్దివాలాకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని అత్యుత్తమ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారధ్యపు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆమోదించింది.

ఈ మేరకు ఈ ఇద్దరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారని అధికార ప్రకటనలో తెలిపారు. వారు వచ్చే వారం సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేస్తే మొత్తం జడ్జిల సంఖ్య 34 అవుతుంది. ఇక సుధాంశు ధులియా ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు జడ్జిలు అయిన రెండో జడ్జిగా నిలిచారు. గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతోన్న జస్టిస్ పర్ధివాలా పార్శీ తెగకు చెందిన వారు. ఈ సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టుకు నాలుగో జడ్జిగా నిలిచారు. ఈ ఏడాది జనవరిలో జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పదవీ విరమణ జరిగింది. దీనితో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా ఇది 32కు పడిపోయింది,. అయితే ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో తిరిగి పూర్తి స్థాయిలో 34కు ఈ సంఖ్య చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News