కోల్ కతా: ఆర్ జి కర్ ఆసుపత్రిలో ఓ మహిళా శిక్షణ వైద్యురాలు హత్యాచారానికి గురికావడంపై న్యాయం జరగాలని కోరుతూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా వారితో చేరారు. రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ నుంచి పరిచయ్ పాండ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ నుంచి అలోలికా ఘోరుయ్ ఆమరణ నిరాహార దీక్ష లో చేరారు. దీంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 10 కి చేరింది. మరో ఇద్దరు సిలిగురి లోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజ్ కు చెందిన వారు.
కాగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారింది. వారంతా అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయం సాధించడం కోసం తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని వారు మొండిగా చెబుతున్నారు.