Friday, November 22, 2024

నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ యుజి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటి)జంషెడ్‌పూర్‌కు చెందిన బిటెక్ గ్రాడ్యుయేట్‌తోపాటు ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులను సిబిఐ శనివారం అరెస్టు చేసింది. దీంతో నీట్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ అరెస్టు చేసిన వారి సంఖ్య 21కి చేరుకుంది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఒక వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న కుమార్ మంగళం బిష్ణోయ్, మొదటి సంవత్సరం విద్యార్థి దీపేందర్ శర్మతోపాటు ఎన్‌ఐటి జంషెడ్‌పూర్ నుంచి బిటెక్(ఎలెక్ట్రికల్) పట్టా పొందిన శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశి, అలియాస్ పాశును సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

హజారీబాగ్‌లో మే 5న పంకజ్ కుమార్ అనే ఇంజనీర్ చోరీ చేసిన నీట్ ప్రశ్నాపత్రానికి ఆన్సర్ కీని తయారుచేయడంలో ఈ ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులు సాయపడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది. పంకజ్ కుమార్, రాకీలకు శశికాంత్ పాశ్వాన్ తోడ్పడ్డాడన్న ఆరోపణలపై సిబిఐ అరెస్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News