Monday, November 18, 2024

భారత్‌లో మరో రెండు మంకీపాక్స్ కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Two more monkeypox cases in India

కేరళ, ఢిల్లీలో కొత్త కేసులు

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఒక్క రోజే మరో రెండు కేసులు బయటపడడంతో మొత్తం కేసుల సంఖ్య 8 కి చేరింది. మంకీపాక్స్ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు మృతి చెందగా, కొత్తగా అక్కడ మరో వ్యక్తి (30 ఏళ్లు) లో ఈ వైరస్ లక్షణాలు వెలుగు చూశాయి. జులై 27న యూఏఈ నుంచి కాలికట్ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. మలప్పురం లోని ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నామని , ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. త్రిసూర్‌లో మరణించిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడితో 10 మందికి కాంటాక్ట్ ఉంది. దీంతో ఇప్పటివరకు 20 మందిని క్వారంటైన్‌లో ఉంచాం అని మంత్రి తెలిపారు. కేరళలో ఇప్పటివరకు 5 మంకీ పాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఢిల్లీలో మూడుకి చేరిన కేసులు
దేశ రాజధాని నగరంలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీలో మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిందని ఇటీవలి కాలంలో అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని రాజ్యసభలో వెల్లడించారు. తాజా కేసుతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరగా, దేశ వ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 8 కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News