Thursday, January 23, 2025

గొర్రె తోక బెత్తెడు.. అవినీతి బారెడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ఒకటి గొర్రెల పంపిణీ. గొల్ల కుర్మలకు చేయూతను అందించేందుకు చేపట్టిన ఈ పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.700 కోట్లుగా ఉంటుందని తేల్చారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన ఎసిబి అధికారులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారంనాడు పశుసంవర్థక శాఖ మాజీ సిఇఓ రాంచందర్‌రావు, మాజీ ఓఎస్‌డి కల్యాణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను రాంచందర్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీరిద్దరిని అరెస్టు చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ కుమార్‌తో పాటు మరికొం దరిపై ఎసిబి కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎసిబి తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఎసిబి లోక్ సభ ఎన్నికల ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ కేసులో ఎసిబి మరోసారి జోరు పెంచడంతో తదుపరి చర్యలు ఎవరి మీద ఉండబోతున్నాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా ఈ స్కామ్‌లో మాజీ మంత్రి పేరుపై ఎసిబి ఇప్పటివరకు ప్రస్తావించలేదు. అయితే ఆయనపై వస్తున్న ఆరోపణలను గతంలోనే తోసిపుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News