Sunday, December 29, 2024

సిఎం కెసిఆర్‌పై మరో రెండు పాటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై రిలీజ్ అవుతున్న కొత్త పాటలు కేక పుట్టిస్తున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసిన “గులాబీల జెండలే రామక్క” పేరుతో ఇప్పటికే విడుదలైన పాట తెలంగాణలో దుమ్ముదులుపుతుంది. ఈ పాట సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహా పార్టీ కీలక నేతలు, అభ్యర్థులు స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా సిఎం కెసిఆర్‌పై మరో రెండు కొత్త పాటలు విడుదలయ్యాయి. “గులాబీ జెండా ఎరగాలె…గుంపులు కట్టి నడవాలె…మూడోసారి ముచ్చటగా కేసీఆరే కావాలె” పాటతో పాటు “ధక్కరే ధక్కా…హ్యాట్రిక్ పక్కా…తీస్రీబార్ కేసీఆర్‌” అనే పాటను బిఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త పాటలు మనసు హత్తుకునేలా..ఆలోచింపజేసేలా ఉండటంతో ఈ కొత్త పాటలు కూడా ట్రెండింగ్‌గా మారనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News