Sunday, April 6, 2025

కేరళలో రెండు రోజుల పాటు సంతాప దినం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: జులై 30.31 తేదీలలో సంతాప దినాలు పాటించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ వాయిదా వేశారు. భారీ వర్షానికి అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు 84 మంది చనిపోయారని సమాచారం. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. కేరళలోని వాయనాడ్ లో ఊహించనంతటి విపత్తు ఏర్పడింది.

కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్ ‘‘ విపత్తు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టేందుకు తోడ్పడతామన్నారు’’ అని తెలిపారు.

వాయనాడ్ విపత్తును ఎదుర్కొంటున్న కేరళకు సాయపడేందుకు కర్నాటక ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అన్ని విధాల సాయపడతామని కర్నాటక సిఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు. ‘‘ ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలకు మేము అండగా ఉన్నాము. కేరళకు కావలసిన సాయం అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ‘ఎక్స్’ పోస్ట్ పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News