Sunday, December 22, 2024

రెండు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

దేశీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపుల పర్వం వరుసగా నాలుగవ రోజు గురువారం కూడా కొనసాగింది. విస్తారా, ఇండియో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు అంతర్జాతీయ విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. కాగా..బుధవారం ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏడు విమానాలు బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నాయి.

అంతకుముందు..సోమ, మంగళవారాలలో వివిధ భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు డజను విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. గురువారం ఫ్రాంక్‌ఫఱ్ట్ నుంచి వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముంబై విమానాశ్రయంలో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అదే సమయంలో తుర్కియేలోని ఇస్తాన్‌బుల్ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి కూడా బాంబు దెదిరింపు రావడంతో ముంబై విమానాశ్రయంలో విమానానికి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News