Wednesday, April 2, 2025

హైదరాబాద్ లో ఇద్దరు మయన్మార్ శరణార్థులపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలపూర్ లో శుక్రవారం రాత్రి ఇద్దరు మయన్మార్ కాందిశీలకులపై  దొంగలు దాడిచేశారు. వివరాలలోకి వెళితే… మహబూబ్ ఉర్ రహ్మాన్, ముహమ్మద్ షబ్బీర్ బార్కాస్ సమీపంలోని కొత్తపేట్ గ్రౌండ్ నుంచి ఫుట్ బాల్ ఆడి తిరిగొస్తుండగా గాంజా, మద్యం సేవించి ఉన్న దొంగలు కొందరు వారిపై కత్తులతో దాడిచేశారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. కేసునమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News