Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు నక్సలైట్లు లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఒక సభ్యురాలితో సహా ముగ్గురు నక్సలైట్లు శనివారం పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. వారిలో ఒక మహిళా నక్సలైట్, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్‌కు చెందిన ఒక కామ్రేడ్ ఇద్దరిపై కలిపి రూ. 2 లక్షల బహుమతి లోగడ ప్రకటించారని ఆయన తెలిపారు.

‘అమానవ’ మావోయిస్ట్ సిద్ధాంతంతో నిరాశ చెందినట్లు పేర్కొంటూ కవాసి హుంగా, నుప్పో భీమ, మహిళ నక్సలైట్ హేమ్లా శాంతి సీనియర్ పోలీస్ అధికారుల ముందు లొంగిపోయినట్లు అధికారి తెలియజేశారు. నక్సలైట్ల పునరావాసానికి జిల్లా పోలీసుల కార్యక్రమాల పట్ల సంతుష్టి చెంది వారు ఆయుధాలు త్యజించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం ప్రకారం వారికి సదుపాయాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News