Wednesday, January 22, 2025

గడ్చిరోలిలో ఇద్దరు నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two naxals arrested in Gadchiroli

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇద్దరు పేరుమోసిన నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేసినట్లు గడ్చిరోలి ఎస్‌పి అంకిత్ గోయల్ శనివారం తెలిపారు. ఈ ఇద్దరు నక్సలైట్లపై రూ. 10 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఉత్తర గడ్చిరోలి జిల్లాలో మళ్లీ దళాలను ఏర్పాటు చేయడానికి ఈ ఇద్దరు నక్సలైట్లలో ఒకరిని వారి సీనియర్లు పంపించినట్లు ఆయన చెప్పారు. 2021లో మరిందతోలా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ అడవుల్లో మళ్లీ నక్సల్ దళాలను నిర్మించేందుకు నక్సల్స్ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. శుక్రవారం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ధనోరాలోన సవర్గావ్ ప్రాంతంలో కృష్ణ అలియాస్ సన్నిరం నరోతె(24), సంకురాం నరోతె(22) అనే ఇద్దరు నక్సల్స్‌ను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వీరిద్దరి గురించి ఎటువంటి సమాచారం అందించిన రూ. 10 లక్షల బహుమానం అందచేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News