Friday, December 20, 2024

గడ్చిరోలిలో ఇద్దరు నక్సల్స్ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

నాగపూర్: తూర్పు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. మృతులలో 2019లో జంబుల్‌ఖేడా పేలుడుతో సంబంధమున్న సీనియర్ నక్సల్ నాయకుడు కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. జంబుల్‌ఖేడా పేలుడులో 15 మంది గడ్చిరోలి పోలీసు సిబ్బంది మరణించారు. ఈ పేలుడుకు కారణమైన కన్సూర్ దళానికి చెందిన దిప్యూటీ కమాండర్ దుర్గేష్ వట్టి మరనించిన ఇద్దరు నక్సల్స్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. గొడల్వాహి ఔట్‌పోస్టు సమీపంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బోధిన్తల వద్ద పెద్ద సంఖ్యలో నక్సల్స్ బస చేసినట్లు తమకు

నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, పోలీసు బృందంపై మెరుపుదాడి జరపాలని కుట్రపన్నారని జిల్లా ఎస్‌పి నీలోత్పల్ తెలిపారు. పోలీసులు గాలింపు సాగిస్తుండగా నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని, దాదాపు గంటసేపు సాగిన కాల్పుల పోరు అనంతరం ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు అక్కడ కనిపించాయని ఆయన చెప్పారు. వారి నుంచి ఒక ఎకె 47 రైఫిల్‌తోపాటు ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లభించినట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News