Friday, December 20, 2024

జెడి (యు) నుంచి ఇద్దరికి ఎన్‌డిఎ క్యాబినెట్ బెర్త్‌లు !

- Advertisement -
- Advertisement -

నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ
కేంద్ర మంత్రివర్గ జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్న వైనం
జెడి (యు) ఎంపిలు లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌లకు మంత్రి పదవులు!

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మూడవ పర్యాయం ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండగా క్యాబినెట్ కూర్పుపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. మంత్రివర్గ సహచరుల జాబితాను మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించవలసి ఉంది. జెపి నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీశ్ కుమార్ వంటి ఎన్‌డిఎ పెద్దలు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం కూర్పుపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఒకింత కీలక సమాచారం బయటకు వచ్చింది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జెడి (యు) ఇద్దరు సీనియర్ నేతలు ఎంపిలు లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లను కేంద్ర మంత్రి పదవులకు సిఫార్సు చేసిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

లలన్ సింగ్ బీహార్ ముంగేర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపి. ఆయన భారత రత్న గ్రహీత దివంగత కర్పూరీ ఠాకూర్ కుమారుడు. ఈ ఎన్నికల్లో బిజెపికి 240 స్థానాలు రాగా, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు టిడిపి 16, జెడి (యు) 14 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. బిజెపి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో మిత్ర పక్షాల మద్దతు కీలకంగా మారింది. అందుకే రెండు అంకెల్లో ఎంపి స్థానాలు గెలిచిన టిడిపి, జెడి (యు)లకు మోడీ 3.0 క్యాబినెట్‌లో సముచిత స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News