Thursday, January 23, 2025

సుప్రీం కోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు

- Advertisement -
- Advertisement -

What do courts do on the validity of degrees?

మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న రెండు న్యాయ మూర్తులు పోస్టుల భర్తీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల కొలీజియం ఇద్దరు న్యాయ మూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్శు ధులియా ( ఉత్తరఖండ్ కు చెందిన వారు) గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జంషేడ్ బి పార్దీవాలా (గుజరాత్‌కు చెందినవారు) లను కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో జస్టిస్ సుధాన్శు సుప్రీం కోర్టులో ఉత్తరా ఖండ్ నుండి రెండవ న్యాయమూర్తి అవుతారు. జస్టిస్ జంషేడ్ పార్సీ అల్ప సంఖ్యాక వర్గం నుంచి సుప్రీం కోర్టులో నాలుగవ న్యాయమూర్తి అవుతారు. జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సుభాష్ రెడ్డిల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీల భర్తీకి కొలీజియం ఈ సిఫార్సులు చేసింది. ఒకే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో 11 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి ఏకాభిప్రాయం సాధించి సిఫార్సు చేయడం ఒక రికార్డు. ముగ్గురు మహిళలతో సహా ఒకే సారి 9 మంది న్యాయ మూర్తులు గత సంవత్సరం ఆగష్టు 31న సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News