ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ండోర్‌కు చెందిన ప్రభుత్వ యాజమాన్యంలోని మహారాజా తుకోజీరావు ఆసుపత్రి(ఎంటిహెచ్)లో ఇద్దరు నవజాత శిశువుల మరణం సృష్టించిన కలకలం మరువకముందే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం కారనంగా మరో ఇద్దరు నవజాత శిశువులు తారుమారైన సంఘటన చోటుచేసుకుంది. గురువారం సంభవించిన ఈ సంఘటనపై ఒక నర్సును, ముగ్గురు డాక్టర్లను ఆసుపత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది. నగరంలోని మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఎంటిమెచ్ నడుస్తోంది.
ఖరోన్‌కు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఆడ శిశువును ఉజ్జయిన్‌కి చెందిన మరో కుటుంబానికి జన్మించిన మగశిశువును తారుమారు చేసి ఆసుపత్రి సిబ్బంది ఆయా కుటుంబాలకు అప్పగించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శిశువులు తారుమారు అయినట్లు బయటపడిన వెంటనే ఆసుపత్రి అధికారులు ఆ రెండు కుటుంబాలకు ఫోన్ చేసి, జరిగిన పొరపాటును వివరించి శిశువులను వెనక్కు రప్పించారు. ఆ తర్వాత శిశువులను వారివారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆసుపత్రి అధికారి ఒకరు వివరించారు. కాగా, ఇదే ఆసుపత్రిలో గురువారం ఇద్దరు నవజాత శిశువులు మరణించడంతో ఆయా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో బీభత్సం సృష్టించారు. కల్తీపాలు తాగించడం వల్లే తమశిశువులు మరణించారని వారు ఆరోపించగా ఆసుపత్రి యాజమాన్యం మాత్రం దీన్ని ఖండించింది.
ఇద్దరు నవజాత శిశువులు తారుమారు: నర్సు, డాక్టర్లు సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -