మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన భూకంపం ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లపై కూడా ఈ భూకంప ప్రభావం ఛూపింది. అయితే తాజాగా చైనాలో జరిగిన ఓ ఘటన మానవత్వానికి అద్దం పడుతోంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ పిల్లల ఆస్పత్రిలో భారీగా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఆ అస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడ నుంచి పారిపోలేదు.
ఓ నర్సు ఓ చేత్తో బిడ్డను ఎత్తుకొని మరో చేత్తో బేబిలు బెడ్‌ల నుంచి కిందపడకుండా పట్టుకుంది. మరో నర్సు కూడా ఇతర బేబి బెడ్స్‌ని బలంగా పట్టుకొని ఉండిపోయింది. ప్రకంపనలు ఎంత తీవ్రంగా వచ్చిన వాళ్లు మాత్రం బిడ్డలను వదలలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇంత సాహసం చేసి.. చిన్నారుల ప్రాణాలను కాపాడిన నర్సులను నెటిజన్లు అభినందిస్తున్నారు.