ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలుపై సర్కార్ సీరియస్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు అధికారులను జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సస్పెండ్ చేశారు. జనవరి 8న బాలానగర్‌లో డేటా ఎం ట్రీ కోసం అభయహస్తం దరఖాస్తులను తరలిస్తుండగా రో డ్డుపై పడ్డాయి. ఈ ఘటనకు బాధ్యులైన హయత్‌నగర్ సూపరింటెండెంట్ మహేందర్‌ను సస్పెండ్ చే శారు. మరోచోట కుత్బుల్లాపూర్‌లోనూ అభయహ స్తం దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో సంబంధిత అధికారిపై వేటు వేశారు. ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని జా గ్రత్తగా అప్‌లోడ్ చేయాలని కమిషనర్ హెచ్చరించారు. ఏ ఒక్క దరఖాస్తు వదలకుండా అప్‌లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
కమిషనర్‌ను వివరణ కోరిన మంత్రి
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయని వ స్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు రోడ్డుపాలైన విషయంపై జీహెచ్‌ఎంసి కమిషనర్‌ను మంత్రి వివరణ కోరారు. దీనిపై మంత్రి పొ న్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగం పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలన్నారు. బిఆర్‌ఎస్ అండ తో ప్రభుత్వ శాఖల్లో దొడ్డి దారిన ఉద్యోగులంతా వెళ్లిపోవాలన్నారు. ఈ అంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు. అన్ని శాఖల్లో విచారణ జరగాలని ఆయన పేర్కొన్నారు.