Tuesday, December 17, 2024

ఓట్ల తొలగింపు… ఇద్దరు అధికారులు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉరవకొండలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇద్దరు అధికారులు సస్సెండ్‌కు గురయ్యారని టిడిపి నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఓటు తొలగింపుపై సిఇసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. సిఇసి ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధికారి పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఉద్యోగులు ఇబ్బందులు తెచ్చుకోవద్దని కేశవ్ సూచించారు. 2020, 2021లో టిడిపి మద్దతుదారుల ఆరు వేల ఓట్లను ఇద్దరు అధికారులు తొలగించడంతో కేశవ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ విచారణ చేసి ఇద్దరు అధికారుల వేటు వేయడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News