Thursday, January 23, 2025

సివి ఆనంద్ సహా మరో ఇద్దరికి డిజిలుగా పదోన్నతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపిఎస్ ఆఫీసర్లు సివి ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్‌కు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివి ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండి, జితేందర్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. సివి ఆనంద్, రాజీవ్ రతన్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన వారు. గతేడాది నవంబర్‌లో సిఐడి డిజి గోవింద్ సింగ్, డిసెంబర్‌లో మహేందర్‌రెడ్డి, రెండు నెలల క్రితం ఉమేశ్ పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మూడు డిజి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

సాధారణంగా ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు డిజి హోదాలో ఉంటారు. గత కొన్ని నెలలుగా డిజి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ముగ్గరికి డిజి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను డిఐజిలుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. మరో వైపు ఈ ఏడాది జూన్ 10వ తేదీన 18 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతిని కల్పించింది. మరో వైపు 37 మంది డిఎస్పీలకు అడిషినల్ ఎస్పీలుగా పదోన్నతిని కల్పించింది. ఈ ఏడాది మే మాసంలో ముగ్గురు ఐపిఎస్ అధికారులను ఐజిలుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది.

Jitender

Rajiv

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News