Thursday, January 23, 2025

ఇద్దరు పాక్ చొరబాటుదారుల హతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ /బార్మర్ : మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు పాక్ చొరబాటు దారులను సరిహద్దు భద్రతా దళాలు హతమార్చాయి. రాజస్థాన్ లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర మునబావో ఉత్తర ప్రాంతానికి 10 కిమీ దూరంలో బార్మర్ ఫ్రంట్ వద్ద సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని బిఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. 3 కిలోల హెరాయిన్ వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో 13 బెటాలియన్ బిఎస్‌ఎఫ్ దళాలు సరిహద్దు కంచె దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్నవారిని గమనించి హెచ్చరించారని, వారు వెనక్కు వెళ్లిపోకుండా మరింత ముందుకు దూసుకువస్తుండడంతో కాల్పులు జరిగినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News