రమల్లా: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ నేరాలు యుద్ధ నేరాల క్రిందికి వస్తాయని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. మధ్యప్రాచ్య యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, తూర్పు జెరూసలెంలను 1967లో ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ప్రత్యేక దేశం హోదా కోసం పోరాడుతున్నారు. ఇదిలావుండగా ఇజ్రాయిలీ సరిహద్దు పోలీసుల కథనం ప్రకారం అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘర్షణలు జరిగాయి. వాయువ్య వెస్ట్‌బ్యాంక్‌లో శరణార్థుల శిబిరంలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపడంతో ఆ గన్‌మేన్ మరణించాడు. జెరూసలెం వద్ద ఉన్న మరో శరణార్థి శిబిరంలో ఓ వ్యక్తిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు వందలాది మంది పాలస్తీనియన్లు ఇళ్లపై నుంచి పోలీసులపైకి రకరకాల వస్తువులను విసిరారు. కాగా అప్పుడు మరణించిన వ్యక్తి ఆ ఘర్షలో పాల్గొన్నాడో లేదో తెలియదు.
ఇజ్రాయిలీ కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -