అమరావతి: ఇద్దరు పాన్ ఇండియా డ్రగ్స్ డీలర్లు అరెస్ట్ అయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జూన్ 11న టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో గాజువాక వాసి అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సమాచారం ఆధారంగా ప్రధాన సూత్రధారి అలెక్స్ వాన్ ను అదుపులోకి తీసుకున్నారు. యూపిఐ చెల్లింపులు పరిశీలించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ‘పార్టీ ప్యాక్’ ఇన్ స్టాగ్రామ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇన్ స్టా ఐడి, ఐప అడ్రస్ ద్వారా 2 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ ముఠాలోని కీలక నిందితుడు అలెక్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు పాన్ ఇండియా డ్రగ్స్ డీలర్లు అరెస్ట్ చేసినందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది, పోలీసులను డిజిపి అభినందించారు.
ఇద్దరు పాన్ ఇండియా డ్రగ్స్ డీలర్లు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -