Thursday, December 26, 2024

శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టులో విషాదం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. వారిని నితిన్ షా, షేక్ సకీనా గా గుర్తించారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించగానే అక్కడికక్కడే కుప్ప కూలారు. అక్కడనే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నితిన్ షా స్వస్థలం గోవా కాగా.. సకీనా సౌదీ అరేబియాలోని జెడ్డా అని తెలుస్తోంది. వీరిద్దరి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఎయిర్ పోర్టు పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. వీరి మృతికి గల కారణాల గురించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇద్దరు ప్రయాణికులువేర్వేరు విమానాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి

2024, సెప్టెంబర్ 19వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. విమానం దిగి రన్ వే పై నుంచి ఎయిర్ పోర్టులోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది. ఆ వెంటనే ఎయిర్ పోర్ట్‌లోనే ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఆకస్మిక మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అప్పటి వరకు బాగున్న వారు ఉన్నట్లుండి తనువు చాలిస్తున్నారు. గుండె పోటు మరణాలు కూడా ఇటీవల బాగా పెరిగిపోయాయి. మారిన జీవన శైలి, ఒత్తిళ్ల కారణంగానే ఇలా చనిపోతున్నారని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News