Sunday, January 19, 2025

వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మృతుల్లో గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్, యువకుడు

మన తెలంగాణ/ ములుగు జిల్లా ప్రతినిధి/ కాటారం: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే…భూపాలపల్లి జిల్లా, కాటారం పరిధిలోని బ్రాహ్మణవాగు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి కూంబింగ్ చేస్తున్న క్రమంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగకు తగిలి గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ ప్రవీణ్ (34) మృతి చెందా డు. మంగళవారం మేడిగడ్డలో సిఎం, పలువురు మంత్రులు, ప్రతిప క్ష పార్టీల నేతల పర్యటన ఉన్నందున బందోబస్తు క్రమంలో భా గంగా పలువురు గ్రేహౌండ్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన 11 కెవి విద్యుత్ తీగలకు తగిలి ప్రవీణ్ మృతి చెందాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్ర భుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండ లం, రాజోలుగూడ గ్రామం. మృతునికి భార్య లత, కుమారులు హర్ష, విహాన్ ఉన్నారు. గ్రేహౌండ్స్ సిబ్బంది వెంట ఉన్న ఎఆర్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసున్నారు. అదేవిధంగా అడవి జంతువుల వేటకు గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలం, దుంపెల్లి గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పిండి రమేష్ (28) తన స్నేహితుడు అనిల్‌తో కలిసి ఆదివారం రాత్రి తప్పిపోయిన తన గొర్రెల మందలోని ఒక గొర్రెను వెతికేందుకు అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే రమేష్ మృతి చెందాడు.
కానిస్టేబుల్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి విచారం
కానిస్టేబుల్ ప్రవీణ్ మృతిపై సిఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోవటం దురదుష్టకరమని ఆయన అన్నారు. దుం డగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News