Thursday, January 23, 2025

కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం..  జిల్లాలోని ఆత్మకూర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు జూరాల ఎడమ కాల్వలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో కాలువలో నీటి ఉధృతికి ఐదుగురు నీట మునిగి గల్లంతయ్యారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.  చనిపోయిన వారిలో ఒకరు జెన్కో ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కాగా, మరొకరు ఆయన బంధువు శ్రవణ్ గుర్తించారు. జూరాల కాల్వలో మునిగి ఇద్దరు మృతి వనపర్తి జిల్లా ఆత్మకూర్ లో విషాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News