- Advertisement -
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. అయితే భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఓ కళాశాల విద్యార్థి పిడుగుపాటుకు మరణించాడు. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్ కాలేజీకి వెళ్లి వస్తుండగా.. భారీ వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగుపడి సంతోష్ మృతి చెందాడు. మరోవైపు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆములూరులో చిన్న రాములు అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు. పొలంలో గొర్రెలు కాస్తుండగా.. పిడుగుపడటంతో రాములు మరణించాడు.
- Advertisement -