Saturday, December 21, 2024

ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న ప్రేమ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జనగామా జిల్లా వెంకిర్యాల గ్రామంలో ఇద్దరి ప్రాణాలను ప్రేమవ్యవహారం బలితీసుకుంది. ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని మనస్థాపంతో డిసెంబర్ 25న యువతి కావేరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. యువతి మరణించిన మరుసటి రోజు యువకుడు అరవింద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు యువతి మరణించిన 8 రోజుల్లో యువకుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటనతో వెంకిర్యాల గ్రామంలో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News