Friday, December 27, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిల్ పెట్ రాజీవ్ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. షామీర్పేట్ మండల్ తుర్కపల్లిలో ఫ్యాబ్రికేషన్ పనులు పూర్తిచేసుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా సిఐఎస్‌ఎఫ్ ఎదురుగా రాంగ్ గ్రూప్లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ ప్రయాణిస్తున్న పేర్లు కప్ప బీముడు (28) తారకేష్ (23) లు అక్కడికక్కడే మృతి చెందారు. ఒరిస్సాలోని గంజం జిల్లా జారాడ పరిధిలోని సంతోషపూరు గ్రామానికి చెందిన వీరు నగరంలోని మూసాపేట్ లో గత ఐదేళ్లుగా నివాసముంటున్నారు.

ఒక కాంట్రాక్టర్ వద్ద నిధులు నిర్వహిస్తున్న వీరు రోజువారి క్రమంలోనే తిరిగి వస్తుండగా ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతిచెందారు. రాజీవ్ రహదారిపై ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఒకవైపు రోడ్డు కోతకు గురై ఇరుకుగా ఉండడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని సంబంధిత అధికారులు నిర్లక్ష్యం ఎందుకు కారణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News