శామీర్ పేట : మోటార్ సైకిల్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో ఇ ద్దరు అన్నదమ్ములు మృతి చెం దగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న హృదయ విధారకమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమ్ముని గురుకుల పాఠశాలలో దింపేందుకు వెళ్తూ పాఠశాలకు కొద్ది దూరములోనే ప్రమాదవశత్తు అన్నతమ్ములు మృతి చెందిన సంఘటన పలువురిని కాల్చివేసింది. శామీర్ పేట సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం కి చెందిన మహేష్ ( 20 ) అనే వ్యక్తి తన తమ్ముడైన కృష్ణ (10 )ను శామీర్ పేట పరిధిలో గల గురుకుల పాఠశాలలో దించడానికి
కెటిఎమ్ మోటర్ బైక్ పైన వీరిద్దరి తోపాటు ఇంకొక వ్యక్తి (వివరాలు తెలియదు), ముగ్గురు మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. శామీర్ పేట నుంచి బాబా గూడ వెళ్లే ప్రధాన రోడ్డులో పాత మసీదు వద్ద మహేష్ బైక్ ను నడుపుతుండగా, బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాడు. బైక్ పైన ఉన్న మహేష్, కృష్ణ ల కు తలకు బలమైన రక్త గాయలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ పైన ఉన్న మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించినారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు శామీర్ పేట పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.